హైదరాబాద్ నుంచి సియాటిల్ కు... మైక్రోసాఫ్ట్ టెక్కీ ఆనందం అంతా ఇంతా కాదు!
- మైక్రోసాఫ్ట్‌లో ఫ్రెషర్‌గా చేరిన హైదరాబాద్ టెక్కీ
- కొన్ని నెలలకే సియాటిల్‌కు పంపిన కంపెనీ
- ప్రపంచవ్యాప్త కొత్త ఉద్యోగుల కోసం ప్రత్యేక ఈవెంట్
- కాలేజీలో కన్న కలలు నిజమయ్యాయంటూ ఇన్స్‌స్టాగ్రామ్‌లో వీడియో
- టెక్కీ అనుభవంపై నెటిజన్ల నుంచి ప్రశంసలు
ప్రతిష్ఠాత్మక సంస్థలో ఉద్యోగం సంపాదించాలనీ, అద్భుతమైన అవకాశాలు అందిపుచ్చుకోవాలనీ చాలామంది విద్యార్థులు కలలు కంటారు. అలాంటి ఓ కల నిజమైన సందర్భాన్ని హైదరాబాద్‌కు చెందిన ఓ టెక్కీ సోషల్ మీడియాలో పంచుకోగా, అది ఇప్పుడు ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఫ్రెషర్‌గా చేరిన చేత్నా సింగ్ అనే ఉద్యోగిని, తాను ఉద్యోగంలో చేరిన కొద్ది నెలల్లోనే ఊహించని అనుభవాన్ని పొందినట్లు తెలిపారు. తన అనుభవాన్ని వివరిస్తూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
చేత్నా సింగ్ చెప్పిన వివరాల ప్రకారం.. మైక్రోసాఫ్ట్‌లో ఫ్రెషర్‌గా చేరిన కొద్ది కాలానికే కంపెనీ ఆమెను సియాటిల్‌కు పంపింది. ప్రపంచవ్యాప్తంగా కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారి కోసం "యాస్పైర్ స్టార్ట్ స్ట్రాంగ్" (Aspire Start Strong) పేరుతో ఒక గ్లోబల్ ఈవెంట్‌ను మైక్రోసాఫ్ట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తనను సియాటిల్‌కు విమానంలో తీసుకెళ్లారని చేత్నా వివరించారు. ఈ ఈవెంట్ ద్వారా వివిధ దేశాలకు చెందిన కొత్త ఉద్యోగులను కలుసుకోవడం, నేర్చుకోవడం అనేది ఎదగడానికి గొప్ప అవకాశం అని ఆమె పేర్కొన్నారు.
"కాలేజీ రోజుల్లో ఇలాంటి అవకాశాల గురించి ఆలోచిస్తే, అవి ఎంతో దూరంలో ఉన్నట్లు అనిపించేవి. కానీ, ఒకరోజు నేను ఆ క్షణాలను నిజంగా అనుభవిస్తున్నాను. ఈ విషయం ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు" అని చేత్నా తన వీడియోలో సంతోషం వ్యక్తం చేశారు. సియాటిల్ పర్యటన కేవలం వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చిందని ఆమె అన్నారు. స్ఫూర్తిదాయకమైన సెషన్లలో పాల్గొనడం, వివిధ దేశాల నుంచి వచ్చిన సహోద్యోగులతో మాట్లాడటం, మైక్రోసాఫ్ట్ రెడ్మండ్ క్యాంపస్‌ను సందర్శించడం వంటివన్నీ ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాయని తెలిపారు.
"ఒక వర్క్ ట్రిప్‌గా మొదలైన ఈ ప్రయాణం, నా జీవితంలో మరచిపోలేని అనుభవంగా మారింది. ఆ తర్వాత నేను శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిల్స్ కూడా సందర్శించాను. నా కెరీర్ ఇంత గొప్పగా ప్రారంభమైందంటే ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. నా కలలను నిజం చేసిన మైక్రోసాఫ్ట్‌కు ధన్యవాదాలు" అంటూ చేత్నా తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు. "ఫ్రెషర్లకు ఇది ఎంతో స్ఫూర్తిదాయకం" "ఇలాంటి కెరీర్ ప్రారంభం కావాలని కోరుకుంటున్నాం" అంటూ కామెంట్లు పెడుతున్నారు.